Monsoon : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయంటే..!!

నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది

Published By: HashtagU Telugu Desk
2024 Monsoon

2024 Monsoon

గత ఏడాది దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పెద్దగా పడకపోయేసరికి తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. బోర్లు సైతం ఎండిపోయాయి..దీంతో తాగేందుకు కూడా నీరు లేక చాల ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు.అంతే కాకుండా మూడు నెలలుగా తీవ్ర ఎండలతో ప్రజలు సైతం ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు రాక కాస్త ఉపశమనం కలిగించబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. కాకపోతే ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. వాస్తవానికి రుతుపవనాలు చురుగ్గా మారి.. ఎల్‌నినో ముగిసి లా నినా క్రియాశీలకంగా మారడంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణశాస్త్రవేత్తల ప్రకారం.. ఎల్ నినో ప్రభావం వచ్చేవారంలోగా తగ్గుతుంది. ఆ తర్వాత లా నినా ప్రభావం మొదలవుతుంది. దాంతో రుతుపవనాల సీజన్‌లో వర్షాలు కురుస్తాయని.. భారీ వర్షాలు ఆస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read Also : Gambhir: టీమిండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్‌.. ఈ మూడు కార‌ణాలే సాయం చేశాయా..?

  Last Updated: 30 May 2024, 08:09 AM IST