KTR Nostalgic: ఆ పాత మధురాలను జ్ణాపకం చేసుకున్న కేటీఆర్..!!

తెలంగాణ మంత్రి కేటీఆర్...స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
KTR friends

KTR friends

తెలంగాణ మంత్రి కేటీఆర్…స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్నప్పటి స్నేహితులను…పాఠశాలలో స్నేహితులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటర్మీడియట్ విద్యను విజ్ఞాన్ సంస్థల్లో పూర్తి చేశారు. ఆనాడు తనతో కలిసి విజ్ఞాన్ సంస్థల్లో చదివిన తన తోటి విద్యార్థులను కేటీఆర్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నారు. దీనిపై మంత్రి ట్వీట్ చేశారు.

పాత స్నేహితులను కలుసుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే. విజ్ఞాన్ లోనాతో పాటు చదివిన 91-93 బ్యాచ్ మేట్స్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. 28ఏళ్ల తరవాత కలుసుకున్నాం…కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో అనిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ కలిసిన తర్వా కొన్ని వారాల కిందే విజ్ఞాన్ వడ్లమూడి క్యాంపస్ లో కలిసి చదువుకున్నట్లు అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు కేటీఆర్.

  Last Updated: 01 May 2022, 01:02 AM IST