Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్

Whats Today :  ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు. 

  • Written By:
  • Updated On - November 7, 2023 / 09:52 AM IST

Whats Today :  ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు.  సాయంత్రం 5.05 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.25 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి మోడీ తిరుగుపయనం అవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ  ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఎన్టీఆర్‌ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ప్రకటించారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ నుంచి ఎల్‌బీ స్టేడియం వరకు ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో వెళ్తారు. అందుకే భద్రతా చర్యల్లో భాగంగా ఆ పార్కులను మూసి వేస్తున్నారు.
  • ఇవాళ బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మంథని, పెద్దపల్లిలలో పార్టీ అభ్యర్థులు పుట్ట మధూకర్‌, దాసరి మనోహర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటారు. మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట భారత్‌ పెట్రోల్‌ పంపు సమీపంలోని 12 ఎకరాల స్థలంలో, పెద్దపల్లి జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో సభలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
  • ఇవాళ కరీంనగర్‌లో 24వ డివిజన్ నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర చేయనున్నారు.
  • ఇవాళ సీఎం జగన్ పుట్టపర్తిలో పర్యటిస్తారు. ఉదయం 10.15 గంటలకు పుట్టపర్తి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 12.15 గంటలకు రూ.2,204.77 కోట్ల ‘వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించనున్నారు.
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌ వేశారు.
  • ఇవాళ అనంతపురం జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పర్యటించనున్నారు.
  • ఇవాళ ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో పోలింగ్‌ జరుగుతోంది.
  • ఇవాళ ప్రముఖ నటుడు కమలహాసన్‌ 69వ బర్త్ డే.

Also Read: Sara Ali Khan: గిల్ తో డేటింగ్ పై సారా సమాధానం ఇదే.. “ఆ సారా నేను కాదు.. ప్రపంచమంతా వేరే సారా వెంట ఉంది”..!