Whats Today : ఇవాళ కామారెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- రేపు ప్రధాని మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- తిరుమలలో 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
- కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాహుల్ ఉదయం 11.30 గంటలకు బోధన్‌లో సభకు హాజరవుతారు. బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. అంబంగేట్ సమీపంలో గ్రౌండ్‌లో విజయ భేరి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు వేములవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకొని బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు. కాసేపు రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు.
- ఇవాళ ఖమ్మం జిల్లాలో ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు. ఖమ్మం, పాలేరులో రోడ్ షో.. సత్తుపల్లిలో కార్నర్ మీటింగ్.. మధిర బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు.
- ఇవాళ పటాన్‌చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో(Whats Today) పాల్గొంటారు.