Whats Today : ఇవాళ తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.30 హకీంపేటకు చేరుకుంటారు. హకీంపేట నుంచి 12.35 గంటలకు మోడీ మహబూబాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.25 వరకు 40 నిమిషాలపాటు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు మోడీ కరీంనగర్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.45 నుంచి 3.25 గంటల వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4.35 గంటలకు మోడీ హైదరాబాద్ విమానాశ్రయనికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు హైదరాబాద్ రోడ్డు షోలో మోడీ పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటిస్తారు.నర్సాపూర్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే రోడ్ షోలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.
- ఇవాళ షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
- ఇవాళ ఆదిలాబాద్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పర్యటిస్తారు.
- ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ తరఫున మంద కృష్ణ మాదిగ రోడ్ షో(Whats Today) నిర్వహిస్తారు.