Whats Today : ఇవాళ నిజామాబాద్ రూరల్, నారాయణ్ ఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్ బహిరంగ సభ, మధ్యాహ్నం 12.30 గంటలకు నారాయణ్ ఖేడ్ బహిరంగ సభ, మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు కూకట్ పల్లి రోడ్ షో, సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లి రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు.
- ఇవాళ సిద్దిపేట జిల్లాలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పర్యటిస్తారు., దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
- ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించనున్నారు. దుబ్బాకలో బీజేపీకి మద్దతుగా రోడ్ షోలో ఆయన పాల్గొంటారు.
- ఇవాళ్టితో వైసీపీ సామాజిక సాధికార యాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఈరోజు బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలలో ఒంగోలు(ప్రకాశం జిల్లా), విశాఖపట్నం సౌత్ (విశాఖ జిల్లా), బనగానపల్లె (నంద్యాల జిల్లా) ఉన్నాయి.
- ఇవాళ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగబోతోంది. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈసందర్భంగా 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు అందజేయనున్నారు.