Whats Today : ఇవాళ కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడలలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో పాల్గొంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్‌కు చేరుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇవాళ ఎమ్మెల్సీ కవిత కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్ మెంట్-ది తెలంగాణ మోడల్’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి అభివృద్ధి సాధించిన తీరును కవిత వివరిస్తారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు కవిత ఆదివారం బ్రిటన్‌కు బయలుదేరి వెళ్లారు.
- పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం ఉదయం తుది జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
- ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటిస్తారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. జస్టిస్ నరేందర్ కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వస్తున్నారు.
- సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డు సమావేశం ఉంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ మీటింగ్ జరుగుతుంది. పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈసందర్భంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ ఎస్ఐపీబీలో తీసుకునే నిర్ణయాలకు రేపు (మంగళవారం) జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేస్తారు.
- ఇవాళ ఉదయం జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొంటారు.