Whats Today : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రకటించిన నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
- ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో నేటితో రాజశ్యామల యాగం ముగియనుంది. ఇవాళ పూజ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
- ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్లలో, నిర్మల్ జిల్లా భైంసాలో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
- ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
- ఇవాళ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు పర్యటిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలోనూ ఈటల పాల్గొంటారు. ఆయనకు మద్దతుగా పలు గ్రామాల్లో ఈటల సతీమణి జమున ప్రచారం నిర్వహిస్తారు.
- ఇవాళ కామారెడ్డి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటిస్తారు.
- ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
- ఈరోజు ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌తో ఆఫ్ఘనిస్థాన్ తలపడనుంది. లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం(Whats Today) అవుతుంది.