తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Kaleshwaram Project) వ్యవహారంలో కీలక మలుపుకు వచ్చింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) నేడు బుధవారం ఉదయం 11:30 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జరుగుతున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. తొలుత జూన్ 5న విచారణకు రావాలని కమిషన్ నుంచి నోటీసులు వచ్చినప్పటికీ, ఆయన 11వ తేదీకి మళ్లించాలని అభ్యర్థించగా కమిషన్ ఆమోదించింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లు తమ వాంగ్మూలాలు నమోదు చేసిన నేపథ్యంలో కేసీఆర్ సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది.
Telangana Cabinet : మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా…?
ఈ విచారణ ఓపెన్ కోర్ట్ మాదిరిగా కాకుండా ‘ఇన్ కెమెరా’గా జరగనుండటం ప్రత్యేకత. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విచారణకు హాజరవుతున్న తరుణంలో, ఆయన స్టేట్‌మెంట్ బయటకు రావడానికి అవకాశాలేమీ లేవు. లీకులు మాత్రమే వెలువడే అవకాశముంది. దీంతో కమిషన్ పర్యవేక్షణలో పూర్తి రహస్యంగా విచారణ జరుగనుంది. ఈ విచారణ కేసీఆర్ చుట్టూ తిరుగుతుండటంతో, ఆయన సమాధానాలే కీలకంగా మారనున్నాయి. కమిషన్ ఇప్పటికే ఇంజినీర్లు, అధికారులపై విచారణ జరిపిన తరుణంలో చివరి దశలో కేసీఆర్ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sakshi Office Fire Accident : ఏలూరు సాక్షి ఆఫీస్ దగ్ధం వెనుక వైసీపీ కుట్ర..?
బీఆర్‌ఎస్ వర్గాలు ఈ విచారణను పూర్తిగా రాజకీయ ప్రేరణతో నడుస్తుందని ప్రచారం చేస్తూ, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాయి. కేసీఆర్ కమిషన్‌ను కౌంటర్ చేయకుండా హాజరుకావాలని నిర్ణయం తీసుకోవడంలో వ్యతిరేక ప్రచారాన్ని నివారించాలన్న వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఇది బలప్రదర్శనకు అవకాశంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో నిజాలు వెలుగు చూడాలన్నదే ప్రజల ఆకాంక్షగా ఉంది. ఈ విచారణ తర్వాత రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం ఉంది.