Site icon HashtagU Telugu

KCR Health : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఏమన్నాడంటే!

Kcr Health Update

Kcr Health Update

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ముగింపు పలికేలా ఆయన కుమారుడు కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే కేసీఆర్‌ యశోద దవాఖానలో చేరినట్టు కేటీఆర్‌ స్పష్టం చేశారు. రక్తంలో షుగర్, సోడియం లెవల్స్ వంటి అంశాలపై పరీక్షలు చేయాలని వైద్యులు సూచించగా, అందుకోసం రెండు, మూడు రోజులు దవాఖానలోనే ఉండాలని వారు తెలిపారు.

AP Skill Development : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కువైట్ జాబ్స్ ..త్వరపడండి !

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేవని పేర్కొన్నారు. కేసీఆర్‌ స్వయంగా నడుచుకుంటూ హాస్పిటల్‌కు వచ్చారని, డాక్టర్లతో సరదాగా మాట్లాడారని, తన ఆరోగ్య పరీక్షల విషయం తెలిసి ఫోన్ చేసినవారితోనూ స్వయంగా మాట్లాడారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఒంట్లో కొద్దిగా నలతగా అనిపించడంతో ముందుజాగ్రత్తగా వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. కేసీఆర్‌ ఆరోగ్యంపై వస్తున్న అర్థంలేని వార్తలను పట్టించుకోవద్దని కోరారు. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ మాత్రమే జరుగుతుండగా, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని స్పష్టంగా తెలిపారు. ఆయన ఆరోగ్యం సవ్యంగానే ఉందని, కొన్ని సాధారణ పరీక్షల తర్వాత తిరిగి ఇంటికి వస్తారని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల్లో ఉన్న ఆందోళన కొంతవరకు తగ్గింది.