Owaisi: ప్రేమంటే ఇలా ఉంటుంది..ఆస్ట్రేలియాలో భారత్ -పాక్ మ్యాచ్ పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు…!!

పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ 2023లో ఆడేందుకు భారత జట్టును పంపకూడదన్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ,ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 09:11 AM IST

పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ 2023లో ఆడేందుకు భారత జట్టును పంపకూడదన్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ,ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ ఎందుకు ఆడుతుందన్నారు. భారత జట్టును పాకిస్తాన్ లో ఆడేందుకు పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు..రేపు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? ఆడాలని అనుకోలేదు. పాకిస్తాన్ కు వెళ్లము. కానీ ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ మ్యాచ్ ఆడతాం. ఇదెక్కడి ప్రేమ.?

పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే ఎలా? టెలివిజన్ కు రూ. 2000కోట్లు నష్టం కదా? అయితే ఇది భారత్ కంటే ముఖ్యమా? వదిలెయ్ ఆడకు.మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. కానీ నేను కూడా భారత్ గెలవాలని కోరకుంటున్నాను. షమీ, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు పాకిస్తాన్ ను ఓడించేందుకు తమ శాయశక్తులూ ప్రయత్నిస్తారు.

భారత్ గెలిస్తే ఛాతీ కొట్టుకుంటారు
ఓవైసీ ముస్లీం ఆటగాళ్లను పరోక్షంగా ట్రోలింగ్ ను ప్రస్తావిస్తూ…భారత్ గెలిస్తే ఈ వ్యక్తులు ఛాతీ కొట్టుకుంటారు. భారత్ ఓడిపోతే మ్యాచ్ లో ఎవరి తప్పు ఉందని వెతకడం ప్రారంభిస్తారు. మీ సమస్య ఏంటి. ఇది క్రికెట్. మా హిజాబ్ తో.మా గడ్డంతో పాటు మా క్రికెట్ తో కూడా మీకు సమస్య ఉందా అని అన్నారు.

కాగా బీసీసీఐ సెక్రటరీ జేషా..భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లబోదన ప్రకటించడంతో భారత్ వర్సెస్ పాకిస్తాన్ అనే వివాదం చెలరేగింది. ఆసియా కప్ లో పాల్గొనేందుకు భారత్ పాకిస్తాన్ కు వెళ్లాలా వద్దా అనే అంశంపై హోంమంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.