KCR : ఢిల్లీలో కేసీఆర్ మకాం వెనుక మర్మమేంటీ? సరికొత్త వ్యూహమా?

టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారిగా హస్తినాకు వెళ్లారు సీఎం కేసీఆర్. అయితే గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన గులాబీ బాస్ వెనకున్న మర్మమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారిగా హస్తినాకు వెళ్లారు సీఎం కేసీఆర్. అయితే గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన గులాబీ బాస్ వెనకున్న మర్మమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లిన కేసీఆర్..అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు, మరమ్మత్తులు, వసంత్ విహార్ లో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం పనులు, వారికి సూచనలు ఇవన్నీ జరిగాయి. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారని కేసీఆర్ అన్నారు. అయితే ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఏ పార్టీ నేతలనూ కలవకపోవడం…ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం…కేవలం ఇంటికే పరిమితం కావడంతో…కేసీఆర్ ఏదో వ్యూహం రచిస్తున్నారని కొందరి అంటుంటే..ఆయన ఏం చేస్తున్నారో అంతుచిక్కడం లేదని కొందరు అంటున్నారు.

అయితే రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటారు కేసీఆర్ అంటూ వార్తలు వచ్చాయి. అక్కడ పలు రంగాల ప్రముఖలుతోపాటు రాజకీయ ప్రముఖులతో భేటీ అవుతారంటూ ఒకటే హడావుడి చేసింది మీడియా. అయితే అనుకున్నది ఒకటి అక్కడ జరిగేది ఒకటి అన్నట్లు..కేసీఆర్ ఒకరిద్దరు తప్పా ఎవర్నీతోనూ భేటీ కాలేదు. అక్కడ అసలు రాజకీయ సందడే కనిపించడంలేదు. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో…అధినేత కేసీఆర్ ఢిల్లోనే కాలక్షేపం చేయడం వెనకున్న మతలాబు ఎవరికీ తెలియడం లేదు.

అయితే వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేసేందుకే కేసీఆర్ ఢిల్లీలో ఉన్నట్లు భావిస్తున్నాయి రాజకీయవర్గాలు. మునుగోడు బాధ్యతను కొడుకు కేటీఆర్ కు అప్పగించారు. కాబట్టి బీఆర్ఎస్ పైన్నే ఎక్కువ ఫోకస్ చేశారు గులాబీ బాస్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే కొంతకాలం ఢిల్లీలోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. కూతురు కవితకు బీఆర్ఎస్ లో బాధ్యతలు అప్పగిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఢిల్లీలో ఉంటూ ఎలాంటి వ్యూహరచర చేస్తున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ కు తెరపడుతుందో లేదో చూడాల్సిందే.

  Last Updated: 15 Oct 2022, 05:57 AM IST