Site icon HashtagU Telugu

KCR Cabinet Meeting : సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం వెనుక రహస్యం ఏంటి..?

Kcr Cabinet

Kcr Cabinet

తెలంగాణ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివెళ్లి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెల్లో ఎప్పటిలాగానే ఓటు హక్కును వినియోగించగా..గ్రేటర్ ప్రజలు మాత్రం మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. 119 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైంది.

ఇక ఓటింగ్ ముగిసిందో లేదో.. అందరి ఆసక్తిగా ఎదురుచూసినట్లే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. తెలంగాణ ఓటరు తీర్పుపై ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అనేక సంస్థలు ఏకకంఠంగా కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వం ఎంత..? వాటిని ఎంత వరకు నమ్మొచ్చు..? 2018 లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మహాకూటమి విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. కానీ అసలైన రిజల్ట్ మాత్రం బిఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుందా..? అందుకే కేసీఆర్ ధీమా గా ఉన్నాడా..? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలనే కాదు కాంగ్రెస్ నేతలను కూడా కలవరపెడుతుంది.

ఎగ్జిట్ పోల్ కచ్చితత్వం ఎంత..?

We’re now on WhatsApp. Click to Join.

ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి కాస్త అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే అంచనాలు తప్పే అవకాశం ఉంది. 90 శాతం దగ్గరగా ఉంటేనే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థల అంచనాలు నిజమవుతాయి. కానీ కొన్ని సంస్థలు 60 శాతం ఉన్నా.. ఫలితాలను డిసైడ్ చేస్తున్నారు.

ఒకవేళ ఈసారి ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైతే..కాంగ్రెస్ – బిఆర్ఎస్ లకు కొద్దీ గొప్ప తేడాతో సీట్లు వస్తే..మిగతా పార్టీలు బిజెపి , AIMIM , ఇతరులు ఎవరికీ మద్దతు ఇస్తారు..? బిజెపి పార్టీ కాంగ్రెస్ తో పొత్తు అనేది కుదరని పని..AIMIM కూడా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ దూరమే..బిఆర్ఎస్ పార్టీకే వాళ్లు మద్దతు ఇస్తూ వస్తున్నారు..సో..బిజెపి , AIMIM ఇరు పార్టీల నుండి గెలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపిస్తారు..ఇక ఇతరుల విషయానికి వస్తే ఏదైనా పదవి ఇస్తానంటే ఖచ్చితంగా వీరు ఆ పార్టీకే మద్దతు ఇస్తారు..ఇలా వారికీ పదవుల పేరుతో తమ పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానిస్తారా..? ఇలా ముందు చూపుతో కేసీఆర్ డిసెంబర్ నాల్గో తారీఖున క్యాబినెట్ సమావేశం జరపబోతున్నారా..? అసలు కేసీఆర్ మైండ్ లో ఏముందనేది అంతుపట్టడం లేదు. ఇదంతా కాదు జస్ట్ ఎమ్మెల్యేల రాజీనామాలు , మంత్రుల పదవులు..తదితర అంశాల గురించి మాట్లాడబోతున్నారా..? ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాదానాలు తెలియాలంటే డిసెంబర్ 03 వ తారీఖు ఫలితాలు మొత్తం వచ్చే వరకు ఆగాల్సిందే.

Read Also : Hyderabad : హైదరాబాద్ పోలింగ్ శాతంఫై పవన్ ఆగ్రహం