మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy ) ఇంట్లో సోదాల తర్వాత ఈడీ (ED Rights) ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మాజీ మంత్రి KTR స్పందించారు. ఐదు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, ఫామ్ హౌజ్‌తో పాటు తదితర ఐదు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అధికారులు తనిఖీలు చేపట్టారు.
గతంలో ఆయన కుమారుడు హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు ఖరీదైన వాచ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఫహెర్దీన్ ముబీన్ నుంచి వాచ్‌లను హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విచారణలో అలోకం నవీన్ రూ. 100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టిన అధిఅక్రూలు పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ తనిఖీల తర్వాత ED ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు. ఎందుకు సోదాలు చేసారో..? సోదాల్లో ఏమేమి బయటపడ్డాయో…? అనే విషయాలు తెలుపకుండా సైలెంట్ అయ్యింది.
ఈ సైలెంట్ ఏంటి అని తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..ఈడీని ప్రశ్నించారు.’మహా సంపన్న తెలంగాణ మంత్రిపై దాడుల తర్వాత ఏంటి ఈ మౌనం ఈడీ? 5 రోజుల తర్వాత కూడా ఎలాంటి ప్రకటన లేదా? ఈ డ్రామా బీజేపీ, కాంగ్రెస్ ‘అజబ్ ప్రేమికి గజబ్ కహానీ’లో భాగమేనా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటు కాంగ్రెస్ నేతలు సైతం ఈ దాడుల ఫై సైలెంట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో అదానీ-సెబీ చైర్‌పర్సన్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్‌కు వెళ్లి ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటిది సహచర మంత్రిపై ఈడీ దాడులు జరిగితే సీఎం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు మంత్రులు సైతం ఇదే బాటలో మౌనాన్ని ఆశ్రయించడం కూడా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పెద్దలు కావాలనే పొంగులేటిని లైట్ తీసుకున్నారా? అని చర్చించుకుంటున్నారు.
Read Also : Womens T20 World Cup: రేపట్నుంచి మహిళల టీ20 ప్రపంచకప్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?