Site icon HashtagU Telugu

CMs Powers : ఎన్నికల కోడ్ టైం.. సీఎంలకు ఉండే పవర్ ఎంత ?

Cms Powers

Cms Powers

CMs Powers : ఇప్పుడు దేశంలోనే పవర్ ఫుల్ ‘ఎన్నికల కోడ్’ !! ఈ టైంలో సీఎంలు కూడా ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకోకూడదు.  పాలన అంతా అంతర్గతంగా జరగాలే కానీ పబ్లిసిటీ చేసుకోకూడదు.ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. సీఎంల విషయంలో ఇదే రూల్ !!  ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్‌ను పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ అంటారు. రాజకీయ పార్టీల అధికార, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్ ప్రధాన లక్ష్యం. ఇతర నిబంధనలు ఎలా ఉన్నా అధికారంలో ఉన్న వారు ఓటర్లను ప్రభావితం చేయకుండా.. దుర్వినియోగం చేయకుండా కోడ్ ను పటిష్టంగా అమలు చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్  అమలులో ఉంటుంది. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఇవాళ వికారాబాద్ అడవులకు ప్రణీత్ ​రావు !

Also Read :Brother Weds Sister : అన్నాచెల్లెళ్ల పెళ్లి.. గవర్నమెంట్ డబ్బుల కోసం కక్కుర్తి