AP Vs Telangana : సాగర్‌పై ఏపీ వర్సెస్ తెలంగాణ.. జల జగడం ఎందుకు ?

AP Vs Telangana : నాగార్జున సాగర్‌.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Ap Vs Telangana

Ap Vs Telangana

AP Vs Telangana : నాగార్జున సాగర్‌.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. నవంబర్ 30న తెల్లవారుజామున నాగార్జున సాగర్ 13వ గేట్‌ వద్దకు దాదాపు 500 మంది ఏపీ పోలీసులు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి, ఆధీనంలోకి తీసుకోవడంతో హైటెన్షన్ ఏర్పడింది. ప్రాజెక్టులోని 26 గేట్లలో సగం (13వ గేట్‌ వరకు) తమ పరిధిలోకే వస్తాయని ఏపీ పోలీసులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో తమను అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై ఏపీ పోలీసులు దాడి చేశారు. మొబైల్‌ ఫోన్లు, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్వయంగా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి వచ్చి చెప్పినా.. ముళ్లకంచెను తీసేందుకు ఏపీ పోలీసులు నో చెప్పారు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం జలవాటా కోసమా ? రాజకీయం కోసమా ? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.  వాస్తవానికి రాష్ట్రాల జల వివాదాలు పోలీసుల పరిధిలోకి రావు. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటివరకు సాగర్ నుంచి నీటి విడుదల, భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఏమైంది ? 

  • అక్టోబర్ 6న కృష్ణా రివర్ బోర్డు.. శ్రీశైలం జలాశయంలో 30 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.
  • అయితే వాటిలో 15 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌‌కు తరలించింది. కానీ ఆ నీటిని ఏపీకి వదలలేదు. వదలమని కోరినా తెలంగాణ పట్టించుకోలేదు.
  • ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఆ నీటిని తెలంగాణ సర్కారు ఉపయోగించుకుంటోంది.
  • తాజాగా నవంబర్ 30న తెల్లవారుజామున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీ పోలీసులు డ్యామ్ దగ్గరకు వెళ్లి.. ఏపీ వైపు ఉన్న 13 గేట్లను ఎత్తి కుడి కాలువ హెడ్ రెగ్యులేరట్ ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని వదిలారు.
  • ఈ నీటిని  గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేశారు. ఈ జిల్లాల్లో చాలాకాలంగా నీటి కొరత ఉంది. అందుకే ఏపీ పోలీసు వర్గాలు సాగర్‌కు వచ్చి నీటిని ఈవిధంగా తరలించాయని అంటున్నారు.
  • ఏపీ నుంచి వచ్చిన దాదాపు 1311 మంది పోలీసులు ప్రస్తుతం నాగార్జున సాగర్‌పై డ్యూటీలో ఉన్నారని సమాచారం.
  • కృష్ణా రివర్ బోర్డు వంటి సంస్థలు ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తే రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు(AP Vs Telangana)  అంటున్నారు.
  Last Updated: 01 Dec 2023, 09:47 AM IST