కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కి అసలు తెలంగాణతో ఏం సంబంధం అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ప్రశ్నించారు. ‘ఆయనకు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉంది..? గుజరాత్లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా..? బీజేపీ గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం’ అని రేవంత్ సవాల్ విసిరారు. అంతకు ముందు కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సంబరాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆరు గ్యారంటీల పేరు చెప్పి.. 66 మోసాలకు పాల్పడిందని , తెలంగాణలో మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యిందన్నారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని , ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని.. కాంగ్రెస్ విజయోత్సవాలను చూసి ప్రజలంతా షాక్ అవుతున్నారని , విజయోత్సవాల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలపై చర్చకు తాము సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో చేస్తున్న కులగణను బీజేపీ వ్యతిరేకించడం లేదన్నారు. పరిశ్రమల కోసం రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : Naked Art Exhibition : నగ్నంగా వస్తేనే ఎంట్రీ.. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ వెరీ స్పెషల్