KCR Plan: కేసీఆర్ ప్లాన్ ఏంటి..? పార్టీ బ‌లోపేతానికి ఏం చేయ‌నున్నారు..?

కేసీఆర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఎవ‌రూ లేరు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోరాడిన నాయ‌కుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు.

  • Written By:
  • Updated On - April 23, 2024 / 09:58 AM IST

KCR Plan: కేసీఆర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఎవ‌రూ లేరు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోరాడిన నాయ‌కుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR Plan). తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ప‌దేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ గ‌తేడాది ఎన్నిక‌ల్లో ఓడిపోవాల్సి వ‌చ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 39 సీట్లు మాత్ర‌మే సాధించి ప్ర‌తిప‌క్షంగా నిలిచింది. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ అధికారం చేప‌ట్టింది.

కాంగ్రెస్ అధికారం చేప‌ట్టిన మూడు నెల‌ల్లోనే బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. బీఆర్ఎస్ లో గెలిచిన ముఖ్య నేత‌లు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రి, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు, రాజ‌స‌భ్య స‌భ్యుడు కేకే, ఆయ‌న కూతురు, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోవ‌టంతో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లై అయ్యింది.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే అధికారం చేప‌ట్టిన వెంట‌నే బీఆర్ఎస్‌లో ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చే విధంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగిందంటూ ప్ర‌చారం చేశారు. ల‌క్ష కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ కొంద‌రు నేత‌ల‌ను అరెస్ట్ చేసి బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ పార్టీ మ‌నుగ‌డ రాష్ట్రంలో ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొన్న‌టి వర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డిన కేసీఆర్ ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు.

Also Read: MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. బెయిల్ వస్తుందా ?

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌టం కోసం ఇచ్చిన హామీల‌ను ప‌దే ప‌దే గుర్తుచేస్తూ వారిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. క‌రెంట్ కోత‌, రైతుల స‌మ‌స్య‌ల‌ను ప్రస్తావిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఎంపీ ఎల‌క్ష‌న్స్‌లో బీఆర్ఎస్‌కు స‌గం సీట్లు వ‌చ్చేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఒక‌వేళ ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు కొన్ని సీట్లు కూడా రాక‌పోతే పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

We’re now on WhatsApp : Click to Join

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌స్సు యాత్ర పేరుతో అటు పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారం, ఇటు పార్టీ కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌టానికి బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ‌త 12 ఏళ్ల‌లో ఏ టీవీకి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌ని కేసీఆర్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఓ ప్ర‌ముఖ చానెల్‌కు 2 గంట‌ల పాటు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌నున్నారంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. అయితే పార్టీని బ‌లోపేతం చేయ‌టానికి కేసీఆర్ త‌న మార్క్‌, వ్యూహాలు రచించే ఉంటారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.