Site icon HashtagU Telugu

Kalvakuntla Kavitha: బీసీ ఎజెండా.. జాగృతి కండువా.. కవిత ప్లాన్ ఏమిటి ?

Kalvakuntla Kavitha Political Plan Brs Ktr Harish Rao

Kalvakuntla Kavitha:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి  ఏం చేయబోతున్నారు ? ఆమె ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీసీ ఎజెండాతో, భారత జాగృతి కండువాతో యాక్టివ్‌గా ప్రజలతో మమేకం అవుతున్న కవిత భవిష్యత్ ప్రణాళిక ఎవరికీ అంతుచిక్కడం లేదు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకే ఆమె బీసీ ఎజెండాకు ప్రయారిటీ ఇస్తున్నారా ? లేదంటే భవిష్యత్తులో తన వ్యక్తిగత రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకే ఈ విధంగా ముందుకు సాగుతున్నారా ? అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

ఏప్రిల్ 8 పరిణామాలు.. దేనికి సంకేతం ? 

ఏప్రిల్ 8న  (మంగళవారం రోజు)  హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారత జాగృతి(Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ధర్నా చేశారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఒక్క రోజు నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి కవిత మాట్లాడుతున్న సమయంలోనే కేటీఆర్ తెలంగాణ భవన్‌లో చిట్ చాట్ పెట్టారు. దీంతో కవిత ధర్నా విషయం సైడ్ ట్రాక్ అయ్యింది. మీడియాలో కేటీఆర్ చిట్ చాట్ మాత్రమే హైలెట్ అయ్యింది. దీంతో బీఆర్ఎస్‌పై ఆధిపత్యం కోసం కేటీఆర్, కవిత మధ్య పోటీ జరుగుతోందా ? అనే అంశం తెరపైకి వచ్చింది. ఇందిరాపార్కు వద్ద ధర్నాలో కవిత భారత జాగృతి కండువాతోనే కనిపించారు. అంటే స్వతహాగా  భారత జాగృతిని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారా ? అనే ప్రశ్న కూడా ఉదయించింది. కొందరు రాజకీయ పండితులైతే.. భారత జాగృతి భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read :HSRP Features: ఏమిటీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ ? ఫీచర్స్ ఏమిటి ?

కేటీఆర్ సమావేశాలు వర్సెస్ కవిత సమావేశాలు

వారం క్రితం కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ హాజరు కాలేదు. గతంలో కవిత పర్యటన ఉందంటే.. ఆమె ప్రతీ కార్యక్రమంలో తప్పకుండా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, స్థానిక అగ్రనేతలు అందరూ పాల్గొనేవారు. బీఆర్ఎస్‌పై కేటీఆర్‌కు పట్టు పెరిగిన తర్వాత.. లెక్క మారింది. గంప గోవర్ధన్, ముజీబుద్దీన్‌ల గైర్హాజరీని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే కామారెడ్డిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ హాజరయ్యారు. అంటే బీఆర్ఎస్‌ వర్గాలుగా చీలిపోయిందా ? పార్టీలోని నేతలు కవిత, కేటీఆర్ వర్గాలుగా విడిపోయారా ? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే కవిత రౌండ్ టేబుల్ సమావేశం  నిర్వహించిన మరుసటి రోజే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో గంప గోవర్ధన్, ముజీబుద్దీన్  పాల్గొన్నారు. అంటే.. బీఆర్ఎస్ నేతల్లో కొందరు కేసీఆర్, కేటీఆర్‌‌ల సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. కవిత సమావేశాలకు వారు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.  గులాబీ పార్టీలో చోటుచేసుకున్న ఈ అనూహ్య మార్పు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇదంతా గమనించాకే.. కల్వకుంట్ల కవిత రాజకీయంగా తన దారిని తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారని పరిశీలకులు అంటున్నారు.

Also Read :Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు