White Paper – History : వైట్ పేపర్.. శ్వేతపత్రం.. ఇప్పుడు దీనిపై తెలంగాణలో హాట్ డిబేట్ నడుస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు రెండు వైట్ పేపర్లను రిలీజ్ చేసింది. ఒక వైట్ పేపర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై.. మరో వైట్ పేపర్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపైన విడుదల చేసింది. సాధారణంగా బిజినెస్‌లలో వైట్ పేపర్‌ను వినియోగిస్తుంటారు. కాలక్రమంలో అది పాలిటిక్స్‌లో కూడా చోటు సంపాదించింది. ఏదైనా టాపిక్‌పై పూర్తి వివరాలతో ప్రభుత్వం విడుదల చేసే సాధికారిక నివేదికను వైట్ పేపర్ అని చెప్పుకోవచ్చు. ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు దానికి సంబంధించిన వివరాలను వైట్ పేపర్ ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించాలని అంటారు.
We’re now on WhatsApp. Click to Join.
వైట్ పేపర్ విశేషాలు
- 1922లో బ్రిటన్‌లోని చర్చిల్ ప్రభుత్వం తొలిసారిగా వైట్ పేపర్‌ను రిలీజ్ చేసిందని చెబుతారు. యూదులపై ఆనాటి బ్రిటీష్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శ్యామ్యూల్ వైట్ పేపర్‌ను విడుదల చేశారు. దీన్ని ‘చర్చిల్ మోమోరాండం’ అని పిిలుస్తారు.
- బ్రిటన్ నుంచి వైట్ పేపర్ విధానాన్ని అరువు తెచ్చుకున్న దేశాల్లో భారత్, కెనడా, అమెరికాతో పాటు అనేక దేశాలు ఉన్నాయి.
- వైట్ పేపర్ అనేది ప్రామిసరీ నోట్ లాంటిది. అఫీషియల్ డిక్లరేషన్ లాంటిది. అందుకే అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలు తరుచుగా ఏదో ఒక అంశంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తుంటాయి.
- కొన్ని దేశాలలో వైట్ పేపర్‌తో పాటు గ్రీన్ పేపర్ విధానం సైతం అమలులో ఉంది. వివిధ అంశాలపై ప్రభుత్వం ప్రతిపాదనలతో తొలుత గ్రీన్ పేపర్‌ను విడుదల చేస్తుంది. ఇది సూత్రప్రాయ నివేదిక. దీనికి స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత.. తదుపరి దశల్లో వైట్ పేపర్‌ను రిలీజ్ చేస్తాయి.
- కార్పొరేట్ వ్యాపార సంస్థల్లోనూ వైట్ పేపర్‌ను ప్రకటిస్తుంటారు. అయితే అక్కడ షేర్ హోల్డర్ల నమ్మకం కోసం వాటిని రిలీజ్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని వాటాదాలకు తెలిపేందుకు వైట్ పేపర్‌ను(White Paper – History) వాడుతారు.