Site icon HashtagU Telugu

BRS Boss : గులాబీ బాస్ ప్రెస్‌మీట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏం చెప్పబోతున్నారు ?

Kcr Pm

Kcr Pm

BRS Boss : ‘రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెబుతాను’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. గులాబీ బాస్ త్వరలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఏదైనా సంచలన సమాచారాన్ని బయటపెడతారా అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ప్రత్యేకించి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడిన కీలక ఇన్ఫోను కేసీఆర్ వెల్లడిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో తెలంగాణ పోలీసు విభాగంలోని పలువురు అధికారులను టెన్షన్ అలుముకుంది.

We’re now on WhatsApp. Click to Join

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి ? ఆయన కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు  బయటపెట్టబోతున్నారా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. తెలంగాణకు రెండుసార్లు సీఎంగా కొనసాగిన కేసీఆర్ హయాంలో అనురాగ్ శర్మ, మహేందర్​రెడ్డి, అంజనీకుమార్ పోలీస్ బాస్‌లుగా(BRS Boss) వ్యవహరించారు. అప్పట్లో ఇంటెలీజెన్స్  చీఫ్‌లుగా ​శివధర్​రెడ్డి, నవీన్​చంద్, కొన్ని రోజుల పాటు ఇన్‌ఛార్జిగా ప్రభాకర్​రావు, అనిల్​కుమార్ పనిచేశారు. ఎస్ఐబీ చీఫ్‌గా సజ్జనార్, ఆ తర్వాత ప్రభాకర్​రావు బాధ్యతలు నిర్వర్తించారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ఎవరితోనైనా సంప్రదింపులు జరిపి కీలక సమాచారాన్ని సేకరించారా అనే సందేహం తలెత్తుతోంది. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ చెప్పబోయే సమాచారం ఎలాంటి దుమారం రేపుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Also Read : Election In Extreme Heat: ఎలక్షన్ ‘హీట్’: ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఎన్నికల సమరం..!

కేసీఆర్ ప్రకటన తర్వాత ఏయే అధికారుల పేర్లు బయటకు వస్తాయన్న టెన్షన్ గతంలో పనిచేసిన పోలీసు ఆఫీసర్లకు పట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్ పేర్లు వస్తాయని ప్రచారం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సుప్రీమ్ ప్రమేయం ఉందంటూ తన వాంగ్మూలంలో మాజీ డీసీపీ రాధాకిషన్​రావు ఇప్పటికే పలు మార్లు చెప్పారు. ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఎలాంటి వైఖరిని తీసుకుంటారు ? పోలీసుల పాత్ర గురించి ఏం చెబుతారు ? బీఆర్ఎస్‌పై అప్పటి ఇంటెలీజెన్స్ విభాగం పోలీసు బాస్‌లు చేస్తున్న ఆరోపణల గురించి ఏమంటారు ? అనేది వేచిచూడాలి. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడి పోలీసు అధికారులను గులాబీ బాస్ ఇబ్బందుల్లోకి నెడుతారనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read : Samantha : జిమ్‌లో సమంత భారీ కసరత్తులు.. అల్లు అర్జున్ సినిమా కోసమేనా..!