Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? అని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే లబ్దిదారులకు న్యాయం జరిగిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం చెందింది. అంగన్ వాడీ టీచర్లకు మా ప్రభుత్వ హయాంలో జీతాలు పెంచామని.. ప్రస్తుతం రూ.13,650 వేతం అందజేస్తున్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
రేషన్ కార్డులపై సీలింగ్ ఎత్తేశామని గుర్తు చేశారు. ఇన్ కమ్ లిమిట్ పెంచలేదు. కుల గణన సర్వేకు, రేషన్ కార్డుకు ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చినట్టు హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు.. రేషన్ కార్డులపై గందరగోళం నెలకొంది అని తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ పరిమితి పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 3లక్షల 40వేల వరకు పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తు చేయమనడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చినట్టు తెలిపారు.
Read Also: Attack On Kejriwals Car : కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?