Site icon HashtagU Telugu

MLC KAVITHA: BRS పార్టీ ప్రకటనకు కవిత గైర్హాజరు వెనక అంత జరిగిందా..? అందుకే రాలేనంటూ పోస్టులు..!!

Kavitha

Kavitha

విజయదశమి రోజున టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ పార్టీ సర్వసభ్య సమావేశానికి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత హాజరుకాలేదు. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులంతా సమావేశానికి హాజరైనా…కవిత మాత్రం కనిపించలేదు. అంతేకాదు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ప్రకటించిన ఇంచార్జ్ ల జాబితాలోనూ కవితే పేరులేదు. అయితే తాను ఇంట్లో ఆయుధపూజ చేసుకుంటున్నట్లు కవిత సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.

దీంతో ఇప్పుడు కవిత ఎందుకు డుమ్మా కొట్టారన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు షురూ అయ్యాయి. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఎప్పుటినుంచో జరుగుతోంది. సర్వసభ్య సమావేశానికి కేటీఆర్, హారీశ్ రావు హాజరయ్యారు. మరి కవిత ఎందుకు రాలేదు. దీనిపై ప్రతిపక్షలు పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఫ్యామిలీలో కవిత ఒంటరి అయిపోయిందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన పేరు బయటకు రావడంతో..కేసీఆర్ మందలించడాని…అప్పటి నుంచి కేసీఆర్ కు కవితకు మధ్య దూరం పెరిగిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తండ్రిమీద కోపంతోనే కవిత బీఆర్ఎస్ పార్టీ హాజరుకాలేదంటున్నారు.

Exit mobile version