Site icon HashtagU Telugu

KTR : నా చెల్లి డైనమిక్.. చాలా ధైర్యవంతురాలు : కేటీఆర్

Ktr

Ktr

KTR : తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలకు ప్రధాన పాత్ర ఉంటుందన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే తన బాల్యమంతా గడిచిందని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని తెలిపారు. ‘‘నా సతీమణికి చాలా ఓపిక ఉంటుంది. నా  కుమార్తె చిన్నవయసులోనే చాలా బాగా ఆలోచిస్తోంది.  కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది. నా చెల్లి కవిత చాలా డైనమిక్‌. కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతులు లేరు’’ అని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌‌లోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ తెలంగాణలో భాగంగా ‘‘ఉమెన్‌ ఆస్క్‌ కేటీఆర్‌’’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు.  కానీ వాళ్లు తెలియనట్టుగా నటిస్తున్నారు. డిసెంబర్ 15లోగా మహిళల కోసం ప్రత్యేకంగా అజెండా మీరే తయారు చేయండి. అమలు చేయడానికి ప్రయత్నిద్దాం’’ అని కార్యక్రమ నిర్వాహకులకు కేటీఆర్ చెప్పారు. ‘‘మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే దాని ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు. మెంటల్ హెల్త్ సమస్యలను దూరం చేసుకునేందుకు సహాయం అందిస్తారు’’ అని ఆయన తెలిపారు. ‘‘మహిళల కోసం సుల్తాన్ పూర్, నందిగామ సహా మొత్తం 4 చోట్ల ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేశాం. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ల కోసం వీ-హబ్‌లు ఏర్పాటు చేశాం’’ అని కేటీఆర్(KTR) గుర్తు చేశారు.