హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన విందులో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ (Miss England Milla Magee) పట్ల జరిగిన అనుచిత ప్రవర్తన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. మిల్లా మ్యాగీ విందుకు హాజరైన సమయంలో ఇద్దరు అతిథులు అసభ్యంగా ప్రవర్తించినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు విచారణ చేపట్టింది.
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ ఎందుకు ఓడిపోయింది?.. గిల్ సమాధానం ఇదే!
ప్రాథమికంగా గుర్తించిన సమాచారం ప్రకారం.. అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. వారిలో ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా, మరొకరు ప్రముఖ నాయకుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కార్పొరేషన్ పదవిలో ఉన్న వ్యక్తిగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. అయినప్పటికీ, అధికార పార్టీ పెద్దలు ఈ విషయం బయటకు రావద్దని అడ్డుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహిళా సంఘాలు స్పందించి, మొత్తం సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇక మిస్ వరల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ అత్యున్నతాధికారి మాత్రం మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచారణ నివేదికపై వివరణ కోరిన జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆయన, బూతులు మాట్లాడడంతో మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారమంతా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. మిస్ ఇంగ్లండ్ ఆరోపణలతో ఈ ఘట్టం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించడంతో, నిజాలు బయట పెట్టాలన్న డిమాండ్లు మిన్నంటుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.