Hyderabad Ragging: మతం ముసుగులో ‘ర్యాగింగ్’.. జూనియర్ ను చితకబాదిన సీనియర్స్ (Video)

ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హాస్టళ్లు, కాలేజీల్లో ఆగడం లేదు. 

  • Written By:
  • Updated On - November 14, 2022 / 02:25 PM IST

ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హాస్టళ్లు, కాలేజీల్లో ఆగడం లేదు. హైదరాబాద్‌లోని హాస్టల్ గదిలో ఒక లా జూనియర్ విద్యార్థిని చితకబాదడంతో పాటు మతపరమైన స్లోగన్స్ చేయాలని బలవంతం చేశారు సీనియర్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్‌లోని ఐసిఎఫ్‌ఎఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐఎఫ్‌హెచ్‌ఇ)లో మొదటి సంవత్సరం చదువుతున్న హిమాంక్ బన్సాల్‌ను అదే హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు చెంపదెబ్బ కొట్టి తన్నులు తన్నారు. చేతులు మెలితిప్పినట్లు వీడియోలో చూడొచ్చు. “అల్లాహు అక్బర్” చెప్పాలని బలవంతంచేసి మరి తీవ్రంగా కొట్టారు.

వాళ్లలో ఒకడు బన్సల్ పర్సు లాక్కొని డబ్బు మొత్తం తీసుకో’ అని మరొకరికి చెబుతాడు. “నువ్వు చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు తమ్ముడు” అని ఇంకొకరు కూడా దాడి చేశారు. కాలేజీలో అందరూ నార్త్, సౌత్ వివక్ష చూపవద్దని అనుకున్నారు. మళ్లీ మీరు వివక్ష చూపుతున్నారు బాధిత విద్యార్థి చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. అయితే ఈ ఘటనలో ప్రాంతీయ కోణం లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. విద్యార్థిని బలవంతంగా రెండు మతాలకు చెందిన నినాదాలు చేశారని తెలిపారు. మొత్తం 12 మంది విద్యార్థుల్లో మైనర్ సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారందరినీ బిజినెస్ స్కూల్ సస్పెండ్ చేసింది.

Also Read:  Telangana DGP: ‘డీజీపీ’ పోస్టుపై ఉత్కంఠత.. రేసులో ఆనంద్, అంజనీ కుమార్!

రిజిస్ట్రార్, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) సహా ఐదుగురుని పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది కాలేజీ యాజమాన్యం. విద్యార్థిని పొత్తికడుపు ప్రాంతాల్లో కొట్టి బలంగా తన్నారు. జూనియర్ స్టూడెంట్ ప్రైవేట్ భాగాలను కూడా తాకినట్లు పోలీసుల విచారణలో తేలింది.  అంతేకాదు.. కొన్ని రసాయనాలు, పౌడర్‌లను తినమని బలవంతం చేసినట్లు,  లైంగిక దాడికి పాల్పడి, బట్టలు విప్పేందుకు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలని, నిర్ణయించుకున్నట్టు సంస్థ తెలిపింది.