Site icon HashtagU Telugu

KTR: తెలంగాణ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నయ్: కేటీఆర్

Telangana

Ktr

తెలంగాణ ప్రభుత్వ హాయంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 400 మంది లబ్ధిదారులకు 2బిహెచ్‌కె ఇళ్లను పంపిణీ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, పేదల ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సిరిసిల్ల పట్టణంలో నిరాశ్రయులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి అందజేసే బాధ్యతను తానే తీసుకుంటానని, కౌన్సిలర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు.

సమగ్ర కుటుంబ సర్వే, గ్రౌండ్ లెవల్ ఎంక్వైరీ రిపోర్టుల ఆధారంగా ఇళ్లులేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందజేస్తున్నామని సిరిసిల్లా జిల్లా అధికారులు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో 2,788 మందికి ఇళ్లు లేవని జిల్లా యంత్రాంగం సమగ్ర కుటుంబ సర్వే చేసి నిర్ధారించింది. దీంతో సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి (1,260), శాంతినగర్‌ (204), పెద్దూరు (516), రగుడు (70)లో 2,052 2బీహెచ్‌కే ఇళ్లను నిర్మించారు. వాటిలో కొన్ని ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు.

Exit mobile version