Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన నేపథ్యంలో, చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుండి ప్రారంభమైన ఈ ఉష్ణోగ్రతల మార్పు తెల్లవారుజామున పొగ మంచు రూపంలో ప్రజలను ఆశ్చర్యపరిచింది. హైదరాబాదులో మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4 డిగ్రీలు, శివరాంపల్లిలో 10.3 డిగ్రీలు, బాలానగర్‌లో 11.5 డిగ్రీలు, పటాన్‌చెరులో 11.7 డిగ్రీలు, షాపూర్ నగర్‌లో 11.7 డిగ్రీలు, బోయిన్‌పల్లిలో 11.9 డిగ్రీలు, గచ్చిబౌలిలో 9.3 డిగ్రీలు, మచ్చబొల్లారంలో 10.2 డిగ్రీలు, కత్బుల్లాపూర్‌లో 10.2 డిగ్రీలు, వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9 డిగ్రీలు, ఆసిఫ్‌నగర్‌లో 12 డిగ్రీలు, బేగంపేటలో 12 డిగ్రీలు, మోండా మార్కెట్లో 12.4 డిగ్రీలు, నేరెడ్‌మెట్లో 12.1 డిగ్రీలు, లంగర్‌హౌస్లో 12.2 డిగ్రీలు, చందానగర్లో 12.7 డిగ్రీలు, మాదాపూరులో 12.8 డిగ్రీలు, ముషీరాబాద్‌లో 12.9 డిగ్రీలు, కూకట్‌పల్లిలో 13.1 డిగ్రీలు, సఫిల్‌గూడలో 13.3 డిగ్రీలు, మల్లాపూరులో 13.5 డిగ్రీలు, ఆదర్శనగర్లో 13.5 డిగ్రీలు, చాంద్రాయణగుట్టలో 13 డిగ్రీలు, షేక్‌పేటలో 12.8 డిగ్రీలు, హయత్‌నగర్లో 13.3 డిగ్రీలు, ఉప్పల్‌లో 13.4 డిగ్రీలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులకోసం జాగ్రత్తలతో కూడిన సూచనలను కూడా వైద్యులు ఇచ్చారు. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ముదురు రంగు దుస్తులు ధరించాలని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు వేడి పానీయాలు తీసుకోవాలని, ఆస్తమా రోగులు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
అదే సమయంలో, ఆదిలాబాద్ జిల్లాలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. చర్లపల్లి, తిరుమలగిరిలో 13.6 డిగ్రీలు నమోదయ్యాయి. పోచర 6.4, అర్లి 6.6, చాప్రాల్ 6.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో తాండ్రలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో సత్వార్ 6.6, న్యాల్కల్ 6.7, జహీరాబాద్ 6.9, నల్లవెల్లి 6.8 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలో బంట్వారం 6.7, నగరం (టి) 6.8, మన్నెగూడ 6.8, మర్పల్లి 6.8, రంగారెడ్డి జిల్లాలో చందనవల్లి 6.7, ఎలిమినేడు 6.7, సిద్దిపేట జిల్లా పోతరరెడ్డిపేట 6.9, కామారెడ్డి జిల్లా మెనూర్ 6.9, జగిత్యాల జిల్లా 7.3, ఆసిఫాబాద్ 7.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
Read Also : Vijay Diwas : విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు