KTR: పనుల కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం: కేటీఆర్

KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేగంగా ముందుకు సాగుతున్నారు. పలు స్థానాలపై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కెటీఆర్  పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది […]

Published By: HashtagU Telugu Desk
Ktr Response On Assembly El

Ktr Response On Assembly El

KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేగంగా ముందుకు సాగుతున్నారు. పలు స్థానాలపై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కెటీఆర్  పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది కాంగ్రెస్. వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారు’’ ఆయన అన్నారు.

‘‘రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు, తొమ్మిదిన్నరేల్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదు’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే. కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్ళం. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు’’ కేటీఆర్ గుర్తు చేశారు.

‘‘ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలి. BRS పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం. స్దానిక సంస్ధల నుంచి మెదలుకోని, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నది. బలమైన ప్రతిపక్షం మనది. అన్నిటికీ మించి కెసిఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి, రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించాం’’ అని కేటీఆర్ అన్నారు.

Also Read: Praja Palana: ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్‌ ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ, పర్యవేక్షణ ఉంటుంది

  Last Updated: 11 Jan 2024, 12:59 PM IST