Site icon HashtagU Telugu

CM KCR: త్వరలోనే కొత్త పీఆర్సీ తో ఉద్యోగుల వేతనాలు పెంచుతాం: సీఎం కేసీఆర్

BRS plan

CM KCR fires on Congress at Nirmal District Meeting

77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.వెయ్యికోట్లు పంపిణీ చేస్తామని కేసీఆర్ అన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో మెట్రో రైల్‌ విస్తరణ పూర్తిచేయాలని నిర్ణయించామని, కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కి.మీ. మెట్రో సౌకర్యం రానుందని,  ₹2.51లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయని, ఈ 9 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో ₹17.21లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కేసీఆర్ అన్నారు.

Also Read: Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు