Site icon HashtagU Telugu

KTR: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తాం: మంత్రి కేటీఆర్

Ktr

Ktr

పేదల ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు ఒక్కరోజే 13, 300 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు యాజమాన్య హక్కు పత్రాలను అందజేశారు. మొత్తం 1800 మంది లబ్ధిదారులకు పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు న్యాయం జరుగుతున్నది, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి అని అన్నారు. హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 30 వేల ఇండ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తవుతుంది.

మిగిలిన 70 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో అర్హులైన పేదలకు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులను మంత్రి అభినందించారు.

Also Read: Khammam Politics: పాలేరు సీటు యమ హాట్, తుమ్మలకు టికెట్ దక్కేనా!

Exit mobile version