పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించాలంటూ నేడు ఛలో హైదరాబాద్ (Chalo Hyderabad) కు తెలంగాణ మాజీ సర్పంచ్ (Former Sarpanchs) లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ కు వెళ్లకుండా మాజీ సర్పంచ్ లను ముందస్తుగానే ఆయా జిల్లాలలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్ట్ లను హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా అని నిలదీశారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam )..మాజీ సర్పంచ్ లకు తీపి కబురు అందించారు. సర్పంచ్‌లకు వచ్చే మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాజీ సర్పంచ్‌లు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని సూచించారు. సర్పంచ్‌లకు వచ్చే మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని… కానీ, ఆనాడు సర్పంచ్ ల ఆత్మహత్యలకు కారణమైన వారే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also : YS Vijayamma : జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతగానో బాధపడుతున్నా