Site icon HashtagU Telugu

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలామంది రాజకీయ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరంపై ద్రుష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నీటి పారుదల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టు లపై లోతుగా సమీక్ష జరిపారు.

నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలని, ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నామని ఆయన అన్నారు.. అధికారులు పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలని, తెలంగాణ లో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది గుర్తు పెట్టుకొని పని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తాం ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ తేల్చి చెప్పారు.

అంతేకాదు.. నీటివాటా విషయమై కేంద్రంతో చర్చిస్తామని, పెండింగ్ ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల డబ్బుతో జరిగే పన్నుల్లో గోప్యత ఉండదని, పూర్తి వివరాలు ఇవ్వాలని మంత్రి ఆధికారులను ఆదేశించారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం  గురించి ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ఎంత అవసరమైన ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

Also Read: Prakash Raj: కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్