Site icon HashtagU Telugu

CM KCR : తెలంగాణ వలే దేశాన్ని నెంబర్ వన్ చేస్తా…!!

Cm Kcr

Cm Kcr

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దినట్లుగా…బీఆర్ఎస్ తో భారత్ ను ప్రపంచ దేశాల్లో ఆగ్రస్థానంలో నిలబెడతామన్నారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. రాజకీయాలంటే తనకు ఓ టాస్క్ అన్నారు. ప్రజలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి వారి సంక్షేమం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. 21 ఏళ్ల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంతో ప్రారంభమైన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకుని చూసుకుని ముందుకు సాగమన్నారు. రాష్ట్రాన్ని సాధించుకుని తక్కువ కాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు,తాగునీరు అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ కార్యక్రమాలను అమలు చేసుకున్నట్లు వివరించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం దిగడం తప్ప దేశానికి ఒరగట్టింది ఏమీ లేదన్నారు. జై తెలంగాణ నినాదంతో ఉద్యమించి మొత్తం భారాన్ని మోశామన్నారు. తెలంగాణలో కష్టపడిపనిచేసినట్లే దేశం కోసం కష్టపడి పని చేసి సాధించి చూపిస్తామన్నారు. జాతీయపార్టీ పెట్టాలని ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదని కేసీఆర్ అన్నారు. అన్నీ చేసి చూయించి బలమైన పునాదుల మీదినుంచే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Exit mobile version