Site icon HashtagU Telugu

Minister Seethakka: ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తాం: మంత్రి సీత‌క్క‌

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: రాష్ట్ర పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క (Minister Seethakka) వికారాబాద్ జిల్లా ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో ఆదివారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప‌లు పాల‌క‌మండ‌ల్ల ప్రమాణ స్వీక‌ర‌ణ మ‌హోత్స‌వాల‌కు, భూమి పూజ ప‌నుల‌కు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు. హైదరాబాద్ నుంచి కుల్క‌చ‌ర్ల‌కు చేర‌కున్న మంత్రి సీత‌క్క‌కు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ క‌మిటీ, కుల్క‌చ‌ర్ల మార్కెట్ క‌మిటీ స‌భ్యుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ల‌క్నాపూర్ చెరువు రోడ్డు ప‌నుల‌కు శంకు స్థాప‌న చేసిన అనంత‌రం బంజ‌రా భ‌వ‌న్, మున్సిప‌ల్ బ‌వ‌న‌ ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌ర‌రం ప‌రిగి మార్కెట్ క‌మిటీ ప్ర‌మాణ స్వీకారానికి హ‌జ‌ర‌య్యారు. ఈ కార్య‌క్రమాల సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ..ఎన్నిక‌ల్లో ఇచ్చిన అన్ని హ‌మీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఆరు గ్యారెంటిల్లో నాలుగింటిని అమ‌లు ప‌రుస్తున్నామ‌ని…మిగిలిన రెండు గ్యారెంటీల‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని చెప్పారు. విత్తు నాట‌గానే ఫ‌లాలు రావ‌ని..ఫ‌లాలు రావాలంటే కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని..అలాగే హ‌మీల అమ‌లుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

Also Read: Zakir Hussain Passes Away: వాహ్ తాజ్.. తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

ఏక‌కాలంలో రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘ‌న‌త‌ ప్ర‌జా ప్ర‌భుత్వం సొంత‌మ‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, నివాస గృహాల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండ‌ర్, స‌న్న వ‌డ్ల‌కు రూ.500 బోన‌స్ వంటి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌ని తెలిపారు. అన్న‌దాత‌లు పంట మార్పిడికి, వైవిద్యానికి ప్ర‌ధాన్య‌త నివ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. అంత‌ర్ పంట‌ల విధానాన్ని అవ‌లంభించ‌డం ద్వారా అధిక ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చ‌న్నారు మంత్రి సీత‌క్క‌.