Site icon HashtagU Telugu

CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కృష్ణాలో నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలతో సహా.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తన తుది వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

904 టీఎంసీల కోసం పోరాటం

తెలంగాణకు కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి వాటా సాధించుకునేందుకు పట్టుబట్టాలని ముఖ్యమంత్రి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని ఆధారాలను వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని సీఎం తెలిపారు.

Also Read: Jubilee Hills Voters: జూబ్లీహిల్స్‌లోని ఓట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈనెల 17 వ‌ర‌కు ఛాన్స్‌!

గత ప్రభుత్వ వైఫల్యాలు

సమావేశంలో గత పదేళ్లలో కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు ఒప్పుకోవడం వల్ల తీరని అన్యాయం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ప్రస్తావిస్తోందని న్యాయ నిపుణులు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయిందని, ఈ విషయాన్ని ఆధారాలతో సహా ట్రిబ్యునల్ ముందుంచాలని సీఎం ఆదేశించారు.

ఏపీ అక్రమ తరలింపులు, తెలంగాణ వాదనలు