అతి త్వరలోనే డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి టాపర్లను రేవంత్‌రెడ్డి సత్కరించి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మట్టిలో మాణిక్యాలుగా రాణిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చారని విద్యార్థులను ఆయన అభినందించారు. అదేవిధంగా తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి, భవిష్యత్తులో మరింత బాగా చదవాలని హితబోధ చేశారు. పిల్లలను చేర్పించకపోతే, పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలన్న సీఎం, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని తెలిపారు. పిల్లలకు అమ్మఒడి తొలి పాఠశాల కావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి, చిన్న చిన్న పిల్లలను రెసిడెన్సియల్ పాఠశాలల్లో వేసి అమ్మఒడికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Chandrababu: ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు
