నేటి అసెంబ్లీ సమావేశాల్లో VRAల సమస్యను లేవనెత్తి…పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ బలవర్మణం పట్ల రేవంత్ రెడ్డి తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. సమస్యల పరిష్కారానికి సర్కార్ తో పోరాడుదామన్నారు రేవంత్ రెడ్డి.
ఈ అంశంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో మాట్లాడతానని…అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకువస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై సీఎం కేసీఆర్ కు వివరంగా లేఖ రాస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. వీఆర్ఏలు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. పోరాటంలో కాంగ్రెస్ అండగా ఉంటుంది. pic.twitter.com/kyfHZP3exl
— Revanth Reddy (@revanth_anumula) September 5, 2022