Site icon HashtagU Telugu

Kishan Reddy: అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: కిషన్ రెడ్డి

Kishan Reddy Kcr

Kishan Reddy Kcr

Kishan Reddy : మేము అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరు మారుస్తాం. అసలు ఎవడయ్యా హైదర్.. హైదరాబాద్ కు ఆయన పేరు ఎందుకు.. అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదారాబాద్ పేరు మార్చి భాగ్యనగరం అని పెడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడు హైదర్. ఎవరికి కావాలి హైదర్ పేరు. తప్పకుండా హైదర్ పేరు తీసేస్తాం. భాగ్యనగరంగా మారుస్తాం. ఎందుకు మార్చకూడదు పేరు. మద్రాస్ పేరును చెన్నైగా మార్చలేదా? కలకత్తా పేరును కోల్ కతాగా మార్చారు.

బాంబే పేరును ముంబైగా మార్చారు. అప్పుడు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చడంలో తప్పేంటి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో రాజ్ పథ్ పేరును కూడా మార్చాం. కర్తవ్యపథ్ గా మార్చాం. ఒక బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న గుర్తులు, ఆలోచనలు అన్నీ మార్పు చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడే కాదు.. అనేక ప్రాంతాల్లో కూడా ఆలోచన విధానాల్లో మార్పు తీసుకొస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:Dasoju Sravan: చిల్లర రాజకీయాల కోసం లక్షలాది రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెల‌గాటం