Bhatti Vikramarka : గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తాం – భట్టి

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 03:58 PM IST

మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మరోసారి సీఎం రేవంత్ (CM Revanth) చెప్పకనే చెప్పారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్..నేడు ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో మరింత నమ్మకం కూడగట్టుకున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీల్లో మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , 200 యూనిట్లో లోపు ఫ్రీ కరెంట్ , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను నెరవేర్చిన రేవంత్..ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు.

సోమవారం భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. ముందుగా భద్రాచలం స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్..ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka ) తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా భట్టి (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చి మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని , సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలను ప్రకటించామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. భద్రాచలం అభివృద్ధికి తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అలాగే గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తామని ప్రకటించి మరింత ఆనందం నింపారు.

ఇక మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపి గిరిజనుల్లో సంతోషం నింపారు. మా ప్రభుత్వానికి భద్రాద్రి రాముడి ఆశీస్సులు ఉన్నాయని , . ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. భద్రాది రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు. భద్రాద్రికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Gobi Manchurian : ఆ మంచూరియా, పీచు మిఠాయి సేల్స్‌పై నిషేధం