Site icon HashtagU Telugu

Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు

Harishrao Cbn

Harishrao Cbn

Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని వైస్రాయ్‌ గార్డెన్స్‌లో జరిగిన మెదక్‌, హవేలి ఘనాపూర్‌ మండలాల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు ఇచ్చారని హరీశ్‌రావు అన్నారు.”కాంగ్రెస్‌వాళ్ళు ఎప్పుడైనా చెక్ డ్యామ్‌లు నిర్మించారా” అని ఆయన అడిగారు. కాళేశ్వరం, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా బీఆర్‌ఎస్‌ పార్టీ సాగునీరు అందించిందన్నారు. కరోనా ఉన్నప్పటికీ రైతులకు రైతు బంధు అందించామని, బీఆర్‌ఎస్ హయాంలో ఏ ప్రభుత్వ పథకం ఆగిపోలేదని గుర్తు చేశారు. “రైతు బీమా గురించి కాంగ్రెస్ అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ అసెంబ్లీలో ఎన్నో మాటలు మాట్లాడిందన్నారు. తెలంగాణ కోసం మెదక్ జైలులో మూడు రోజులు గడిపాను’’ అని హరీశ్ రావు అన్నారు.

Also Read: PM Modi: విజయకాంత్‌ మరణం పట్ల మోడీ సంతాపం