Site icon HashtagU Telugu

KTR : న్యాయవ్యవస్థపై మాకు పూర్తి గౌరవం ఉంది – కేటీఆర్

Ktr

Ktr

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ (High Court BIG Shock to KTR) తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Quash Petition)ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అలాగే కేసును విచారించేందుకు ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఉన్న అరెస్టు స్టేను కూడా ఎత్తివేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోవడం తో ఆయన్ను ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.

BJP Office : తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ ను తగలబెడతాం – రాజా సింగ్

“నా మాట‌లు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బ‌ల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబ‌ద్ధాలు న‌న్ను అడ్డుకోలేవు. మీ ఆరోప‌ణ‌లు న‌న్న త‌గ్గించ‌లేవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచలేవు. మీ కుట్ర‌లు నా నోరు మూయించ‌లేవు. నేటి అడ్డంకులే రేప‌టి విజ‌యానికి నాంది. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది. నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమవ్వనుంది” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరోపక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) మ‌రోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16 న విచార‌ణ‌కు రావాల‌ని కేటీఆర్‌ను ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్‌ టీమ్‌లో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు. కాగా, క్వాష్‌ పిటన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందీనగర్‌లోని కేటీఆర్‌ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.