Site icon HashtagU Telugu

MLC Kavitha : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు : ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha Telangana Mother Picture

MLC Kavitha:  తెలంగాణ తల్లి రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తిని నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం అనేది సరైన నిర్ణయం కానే కాదన్నారు.  రేవంత్ రెడ్డి ప్రభుత్వపు దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని కవిత పేర్కొన్నారు.   ‘‘తెలంగాణ ఉద్యమ తల్లిని.. ఇప్పుడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు’’ అని ఆమె(MLC Kavitha) విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని కవిత తెలిపారు.

Also Read :Manoj Vs Vishnu : టెన్షన్ టెన్షన్.. మనోజ్ ఇంటి చుట్టూ మంచు విష్ణు ప్రైవేటు బౌన్సర్లు

‘‘బతుకమ్మతో పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు. బతుకును ఆగం చేశారు. బతుకమ్మను మాయం చేశారు’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలని సూచించారు.  ఉద్యమకారులపైకి తుపాకీని ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని కవిత పేర్కొన్నారు.

Also Read :Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు