Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్‌ నిర్మించిందే: రాహుల్

తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసింది అన్న సీఎం కేసీఆర్ ప్రశ్నకు రాహుల్ గాంధీ సూటిగా సమాధానాలిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచార పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ నడిచే రోడ్లను కాంగ్రెస్‌ నిర్మించింది.

Telangana: తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసింది అన్న సీఎం కేసీఆర్ ప్రశ్నకు రాహుల్ గాంధీ సూటిగా సమాధానాలిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచార పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ నడిచే రోడ్లను కాంగ్రెస్‌ నిర్మించింది. కేసీఆర్ చదివిన పాఠశాల లేదా యూనివర్సిటీని కాంగ్రెస్‌ నిర్మించిందని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రాహుల్.

ప్రధాని మోదీ మాట్లాడిన మాటలే కేసీఆర్ రిపీట్ చేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి కేసీఆర్, రాష్ట్రంలో కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నేను ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నాపై 24 కేసులు ఉన్నాయి. ఐదు రోజుల పాటు ఈడీ నన్ను 55 గంటల పాటు విచారించిందని రాహుల్ చెప్పారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు, నా ఇల్లు లాక్కున్నారు. కానీ కేసీఆర్ పై కేసు లేదు. ఎలాంటి రాజకీయ కక్షలకు పాల్పడట్లేదు అని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీతో కేసీఆర్ కు దోస్తీ లేకపోతే ఆయనపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించిన రాహుల్, నాకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, ముందుగా కేసీఆర్ ను ఓడించడం, ఆ తర్వాత కేంద్రంలో మోదీని ఓడించడం అని అన్నారు.

తెలంగాణ ఎన్నికలకు మరో మూడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలతో హీట్ పుట్టిస్తున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో పర్యటనలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తెలంగాణలో ప్రముఖంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ పోటీ నడుస్తుంది. కాగా డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Also Read: T20I : మళ్లీ దుమ్మురేపిన యువభారత్..రెండో టీ ట్వంటీ కూడా మనదే