తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) మరోసారి గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. పదే పదే బిఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు , ఆరోపణలు చేస్తున్నారని , ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేయలేకపోతున్నారు అంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు (congress six guarantees) అమలు చేయలేకపోవడానికి కారణం మీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే అని రేవంత్ అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ రంగాలకు పెండింగ్ పెట్టిన పనులన్నీ కలిపితే దాదాపు 7 కోట్ల లక్షల అప్పులు ఇచ్చారని సీఎం పేర్కొన్నారు.
దీనివల్ల ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, ఆ పాపం బిఆర్ఎస్ పార్టీదేనన్నారు. ‘ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్లో భూములు, హైటెక్ సిటీ.. ఇలా అన్నీ అమ్మేశారు. ఆఖరికి వైన్ షాపుల్నీ మిగల్చలేదు. వీరు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తేవడం వల్ల ఈరోజు రూ. వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం అని చెప్పుకొచ్చారు. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్ లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.
Read Also : Saturday: శనివారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట.. చేశారో అంతే సంగతులు!