Site icon HashtagU Telugu

bandi Sanjay: హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం, పార్లమెంట్ ఎన్నికలపై బండి ధీమా

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay Shocking Comments On CM KCR

bandi Sanjay: హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. చెప్పారు. కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం జాగీరని భావించారు. కానీ పాతబస్తీలోనూ హిందువులంతా ఓటుబ్యాంకుగా మారబోతున్నరు. హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నామన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలో లక్షలాది భోగస్ ఓట్లున్నట్లు ఆధారాలు సేకరించాం. అట్లాగే పెద్ద ఎత్తున ఓట్లు కూడా గల్లంతయ్యాయి. ఓటర్లను సుదూర ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లకు కేటాయించడంతో ఓటింగ్ శాతం కూడా తగ్గింది. వీటికి సంబంధించి బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఆంటోనీరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బృందం అన్ని ఆధారాలతోసహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికితోడు కొత్త ఓటర్లను నమోదు చేయిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని సర్వేలు, జాతీయ మీడియా సంస్థలు సైతం బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలవబోతోందని నివేదికలు కూడా ఇచ్చాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించింది.

గావ్ ఛలో అభియాన్ లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి పల్లె నిద్ర చేయాలి. నగరాల్లో బస్తీ నిద్ర చేయాలి. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలి. చారిత్రాక కట్టడాలుంటే సందర్శించాలి. కొత్త ఓటర్లుంటే వారితో మమేమకం కావాలి. అందులో భాగంగా హుజూరాబాద్ లోని రంగాపూర్ గ్రామంలో రాత్రి బస చేయబోతున్నారు. కాంగ్రెస్ లో చేరికలపై,ఏ రాజకీయ పార్టీ అయినా వారి మనుగడ చూసుకుంటుంది. కానీ ప్రజలు మాత్రం బీజేపీనే ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశానికి దశ దిశ చూపబోయే నాయకుడు నరేంద్రమోదీ మాత్రమేనని విశ్వసిస్తున్నారు.