Site icon HashtagU Telugu

PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ

Modi Adb

Modi Adb

తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్‌ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగే బీజేపీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సభా వేదికగా మోడీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని మోడీ తెలిపారు. ‘దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. పెద్ద ఎత్తున హైవేలను నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. రూ.56వేల కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టామని, NTPC విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితమించమని తెలిపారు. అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన, ఆదిలాబాద్-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, పలు ప్రాంతాల్లో విద్యుదీకరణ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘ఇది ఎన్నికల సభ కాదు. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంతమంది ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు’ అని మోడీ తెలిపారు.

ఇక సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలన్నారు. మిగతా సమయంలో పరస్పర సహకారంతో నడుచుకోవాలని , కేంద్రం, రాష్ట్రం ఘర్షణ పడితే ప్రజలకే నష్టమని తెలిపారు. అభివృద్ధిలో కేంద్రాన్ని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.

Read Also : Actress Sowmya Shetty Arrested : చోరీ కేసులో సినీ నటి సౌమ్యా శెట్టి అరెస్ట్.. ఫ్రెండ్ ఇంట్లోనే 100 తులాల బంగారం తో పరారీ..!