CM Revanth : 27న జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్‌

కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది.

Published By: HashtagU Telugu Desk
We are boycotting the NITI Aayog meeting on 27th: CM Revanth

We are boycotting the NITI Aayog meeting on 27th: CM Revanth

NITI Aayog Meeting: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కేంద్ర బడ్జెట్‌ కేటాయింపు(Central budget allocation)లపై వాడీ వేడీ చర్చ జరిగింది. సమావేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) నిరసన తెలుపనుందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని తెలిపారు. ఈ లోపు కేంద్రం సవరించిన బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తామని , తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీ పూర్తిస్థాయిలో ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అందరం ఏకతాటిపైఊ ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు. రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం అన్నారు.

Read Also: Union Budget : చేనేతకు లేని జీఎస్టీ మినహాయింపు.. నిరాశలో నేత కార్మికులు..!

మరోవైపు నీతి ఆయోగ్ సమావేశాన్ని(NITI Aayog Meeting) ఇతర రాష్ట్రల సీఎంలు కూడా బరిష్కరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ , కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు హాజరు కావడం లేదు. తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కారని కాంగ్రెస్ ఢిల్లీలో ప్రకటించింది. బడ్జెట్‌లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్‌, కేరళ ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. వారు నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజర్ అయ్యే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

Read Also: IPL Couches: కోచ్‌లుగా మారుతున్న 2011 ప్రపంచకప్ హీరోలు

 

 

 

  Last Updated: 24 Jul 2024, 06:55 PM IST