Site icon HashtagU Telugu

Hyderabad – Drinking Water : హైదరాబాద్‌లో 24 గంటలు వాటర్ సప్లై బంద్.. ఎందుకు ?

Water Supply In Hyderabad

Water Supply In Hyderabad

Hyderabad – Drinking Water : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి గురువారం వరకు (24 గంటలపాటు) తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లో బుధవారం నుంచి గురువారం వరకు లో ప్రెజర్‌ తో నీటి సరఫరా ఉంటుంది. అంటే.. ఆ ఏరియాల్లో ఇంతకుమునుపు రోజూ వచ్చిన తీరుగా నీటి సప్లై జరగదు.  ఇక కూకట్‌ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మదీనాగూడ, లింగంపల్లి, దీప్తిశ్రీనగర్, వసంత్‌ నగర్‌, మియాపూర్, భాగ్యనగర్‌ కాలనీలకు పూర్తిగా నీటి సప్లై ఆగిపోతుంది.ఈనేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని కొంత స్టాక్ పెట్టుకోవడం బెటర్. దీంతోపాటు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం సాయంత్రంకల్లా నీటి సప్లై జరుగుతుందని అధికారులు అంటున్నారు. కానీ నిర్దిష్టంగా ఏ టైంలో నీటి సప్లై జరుగుతుందనేది చెప్పడం లేదు.  అసలు 24 గంటలపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సప్లై స్తంభించడానికి కారణం ఏమిటి ? మంజీరా నీటిని సరఫరా చేస్తున్న పైపులకు అక్కడక్కడా లీకేజీ సమస్యలు ఉన్నాయి. అయితే చాలాకాలంగా ఆ లీకేజీలకు మరమ్మతులు చేయించలేదు. ఈ లీకేజీల కారణంగా ఎంతో నీరు వేస్ట్ అవుతోంది. ఈ లీకేజీల వల్ల పైపులైన్లలోకి వర్షాకాలంలో మురుగునీరు చేరుతోంది. అందుకే ఇప్పుడు తాగునీటి పైపులైన్ల లీకేజీలకు అధికారులు రిపేర్లు చేయిస్తున్నారు.  అందుకే బుధవారం నుంచి గురువారం వరకు నీటి సరఫరా ఉండదు.