Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాదులో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) తెలిపింది.

హైదరాబాద్ (hyderabad)  మహానగర నీటి సరఫరా బోర్డు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపడతారు. నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 కింద ప్రశాసన్ నగర్ నుండి అయ్యప్ప సొసైటీ వరకు 1200 mm డయా PSC గ్రావిటీ ప్రధాన పైప్‌లైన్ చాలా చోట్ల లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టేందుకు లీకేజీ మరమ్మతు పనులు జరుగుతున్నందున గోల్కొండ, టోలిచౌకి, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని నివాసితులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు పనులు జరగనున్నాయని హైదరాబాద్ జలమండలి అధికారులు తెలిపారు.

Also Read: Shea Butter : షియా బటర్ ఎక్కడ నుండి వచ్చింది.? ఇది చర్మం, జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది.!